ఎన్టీఆర్ బయోపిక్ పై తారక్ స్పందన..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బుల్లితెర మీద బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేస్తాడని తెలిసిందే. ఈ షోకి సంబందించిన వివరాలతో తెలిపేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎన్.టి.ఆర్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు. తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకుల సెన్సిబిలిటీకి దగ్గరగా ఉంటుందని చెప్పారు.

ఇక సినిమా అయినా ప్రోగ్రాం అయినా తాన్ సెట్స్ కు వెళ్లాకే అంతా అని.. ముందు ప్రిపేర్ అవడం అసలు తెలియదని అన్నారు. ఏదైనా నెగటివ్ వెళ్లినంత దూరం పాజిటివ్ వెళ్లదని అన్నారు. అందుకే జై లవకుశ టీజర్ ప్రేక్షకులకు రీచ్ అయ్యిందని అభిప్రాయపడ్డారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ మీద కూడా తన స్పందన తెలిపారు తారక్.. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నారన్న విషయం మీద బ్రహ్మాండం అనేశారు. జూలై 16 నుండి బిగ్ బాస్ గా ఎన్టీఆర్ స్టార్ మా లో కనిపించనున్నాడు.