
రెండు సంవత్సరాల క్రితం కెరియర్ అయిపోయింది అనుకున్న కాజల్ మళ్లీ వరుస ఆఫర్లతో ఫుల్ ఫాంలో ఉంది. మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150తో హిట్ అందుకున్న కాజల్ ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానాతో కలిసి నటిస్తున్న కాజల్ రీసెంట్ గా కళ్యాణ్ రాం తో కూడా ఓ సినిమా సైన్ చేసిందట.
ఇక ఇవేకాకుండా కింగ్ నాగార్జున నటిస్తున్న రాజు గారి గది-2 లో కూడా కాజల్ ఉంటుందని టాక్. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో సమంత, సీరత్ కపూర్ లు నటిస్తున్నారు. ఇక వీరే కాకుండా కాజల్ కూడా కెమియో రోల్ చేస్తుందట. అయితే కాజల్ రోల్ మాత్రం ఏంటి అన్నది సినిమా రిలీజ్ దాకా సస్పెన్స్ అంటున్నారు చిత్రయూనిట్. ఓం నమో వెంకటేశాయ తర్వాత నాగ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.