మహేష్ తో అనుష్క ఐటం..!

స్పైడర్ తర్వాత మహేష్ చేస్తున్న కొరటాల శివ భరత్ అను నేను ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో మస్త్ జబర్దస్త్ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. కొరటాల శివ తీసిన జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ పక్కా లోకల్ సాంగ్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఇక ఇప్పుడు అదే క్రమంలో మహేష్ సినిమాలో అనుష్కతో ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట.

స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో ఫాంలో ఉంటూ ఫీమేల్ లీడ్ గా సినిమాలు చేస్తున్న అనుష్క ఐటం సాంగ్ చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. మహేష్ తో అనుష్క ఆల్రెడీ ఖలేజా సినిమాలో నటించింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి నటించే అవకాశం రాలేదు. సినిమాలో సిఎంగా నటించబోతున్న మహేష్ మూవీని ఫుల్ ప్యాక్డ్ గా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా రెడీ చేస్తున్నాడట. 2018 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.