రానా కాజల్ రొమాన్స్ కేక..!

దగ్గుబాటి రానా హీరోగా కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. తేజ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ కు రెడీ అవుతుంది. సినిమా రిలీజ్ నెల రోజులు పైగా ఉన్నా సరే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది రానా అండ్ టీం. సినిమాలో రానా కాజల్ ల రొమాన్స్ కేక పెట్టించేసిందని అంటున్నారు. రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.


తేజ డైరక్షన్ లో డిఫరెంట్ సబ్జెక్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు. ఇక కాజల్ తో మొదటిసారి జోడి కట్టి రానా సినిమాలో ఆమెతో అదిరిపోయే రేంజ్ లో రొమాన్స్ చేసినట్టు తెలుస్తుంది. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో రిలీజ్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రానాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. కొద్దిరోజులుగా దర్శకుడిగా సక్సెస్ అందుకోని తేజా కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.