చరణ్ ను మర్చిపోండంటున్న సుక్కు..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ క్రేజీ డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. పల్లెటూరి నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా కోసం సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చరణ్ లుక్ నుండి ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్న సుక్కు సినిమాలో కచ్చితంగా కొత్త చరణ్ ను చూస్తారని ప్రామిస్ చేస్తున్నాడు. తనతో ప్రయాణిస్తున్న చరణ్ ఇదవరకు ఎన్నడూ మీరు చూడని చరణ్ అని.. పాత చరణ్ ను మీరు మర్చిపోండని అంటున్నాడు సుకుమార్.


మైత్రి మూవీ మేకర్స్ లో రాబోతున్న రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న రంగస్థలంపై భారీ అంచనాలే ఉన్నాయి. సుకుమార్ నిర్మాతగా దర్శకుడు సినిమా ప్రమోషన్స్ లో చరణ్ సినిమా గురించి మాట్లాడాడు సుకుమార్. మహేష్ 1 నేనొక్కడినే, తారక్ నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ చెర్రితో రంగస్థలం చేస్తున్నాడు. మరి అంచనాలను మించి సినిమా ఉంటుందో లేదో వచ్చే సంక్రాతికి కాని తేలిపోద్ది.