
మలయాళ నటి కీర్తి సురేష్ లక్ టాలీవుడ్ లో తిరుగులేని విధంగా ఫాం కొనసాగిస్తుంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో మూవీ చేస్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుంది. కె.రాఘవేంద్ర తనయుడు ప్రకాశ్ డైరెక్ట్ చేయబోయే ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కీర్తి సురేష్ సెలెక్ట్ అయ్యింది.
శర్వానంద్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో కీర్తిని ఫైనల్ చేశారట. అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రకాశ్ కోవెలమూడి శర్వానంద్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. మహానటి సావిత్రి బయోపిక్ గా వస్తున్న మహానటి సినిమాలో కూడా కీర్తి సురేష్ నటిస్తుంది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా మంచి ఫాంలో ఉన్న కీర్తి సురేష్ చూస్తుంటే సౌత్ లో టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.