అసుర అసుర.. అదరగొట్టేశావ్ తారక రామా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కె.ఎస్ రవింద్ర బాబి డైరక్షన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమా మీద అంచనాలను పెంచేలా ఉన్న టీజర్ గురించి చెప్పాలంటే అదో అద్భుతం అని చెప్పాల్సిందే. ఈ రావణున్ని చంపాలంటే సముద్రం అంత ధైర్యం కావాలి.    

జై లుక్ లో ఎన్.టి.ఆర్ అదరగొట్టేశాడు.. టీజర్ తో సంచలనాలు సృష్టిస్తున్న తారక్ సినిమా మీద అంచనాలను పెంచేశాడు. సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న తారక్ టీజర్ లో జై పాత్ర రివీల్ చేశాడు. టీజర్ లో కొమ్ముల సింహాసనం మీద తారక్ ఇంటెన్షన్ చాలు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడానికి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేతా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దసరా బరిలో దిగేందుకు వస్తున్న జై లవకుశ సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.