బిగ్ బాస్ పరమ చెత్త షో..!

హిందిలో సూపర్ హిట్ అయిన టెలివిజన్ షో బిగ్ బాస్ ను స్టార్ మా తెలుగు తమిళ కన్నడ భాషల్లోకి తీసుకొచ్చింది. తమిళ కన్నడ భాషల్లో ఆల్రెడీ ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతుంది. తెలుగులో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో పరమ చెత్త షో అంటుంది నటి, దర్శకురాలు లక్ష్మి రామకృష్ణన్. సిని పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి రామకృష్ణన్ అనూహ్యంగా బిగ్ బాస్ షో మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. 

ఆడ మగ అని తేడా లేకుండా ఒకే ఇంటిలో ఉండటం.. వారి మధ్య కలహాలకు దారి తీస్తుందని అన్నది. అంతేకాదు వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ షో ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు స్టార్ మా వాళ్లు 10 కోట్లు ఇచ్చి బిగ్ బాస్ లో నటించమన్నా చేసేది లేదని అంటుంది లక్ష్మి రామకృష్ణన్. తమిళంలో ఇప్పటికే ఈ షో అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక తెలుగులో బిగ్ బాస్ గా ఎన్.టి.ఆర్ జూలై 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.    

ఈ షో కోసం ఎన్.టి.ఆర్ భారీ పారితోషికం అందుకున్నాడని టాక్. రెండు సీజన్లుగా రాబోతున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ఎన్.టి.ఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం.