
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరిష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దువ్వాడ జగన్నాధం. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. మొదటి షో డివైడ్ టాక్ తెచ్చుకున్నా సినిమా భారీ కలక్షన్స్ తో బీభత్సం సృష్టించింది. వారం లోనే 100 కోట్ల కలక్షన్స్ కొల్లగొట్టిన ఈ సినిమా ఈరోజుతో నైజాంలో 20 కోట్ల కలక్షన్స్ వసూళు చేసింది.
అదేదో నోటి లెక్కలా కాకుండా ఏరియా వైజ్ నైజాం కలక్షన్స్ లిస్ట్ ను వెళ్లడించారు దర్శక నిర్మాతలు. డిజె కలక్షన్స్ పై వస్తున్న నెగటివ్ వార్తలన్ని ఖండిస్తూ నైజాంలో 20 కోట్ల కలక్షన్స్ రివీల్ చేశారు. ఇక దర్శకుడు హరిష్ శంకర్ మాత్రం కలక్షన్స్ నిజం కాదని నిరూపిస్తే తాను సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానని ట్వీట్ చేశాడు హరిష్ శంకర్.