
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం బాబి డైరక్షన్ లో నటిస్తున్న సినిమా జై లవకుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్దిరోజుల క్రితం లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ఇంపాక్ట్ ఏమి పడకుండా సినిమాకు సంబందించిన మూడు టీజర్లను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న తారక్ రేపు మూడు టీజర్లను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక రేపు మాత్రం మొదటగా జై క్యారక్టర్ తో రాబోతున్న టీజర్ హై ఎమోషనల్ గా రాబోతుందట. సినిమా మీద అంచనాలను పెంచేలా ఉండబోతున్న జై లవకుశ టీజర్ కచ్చితంగా ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుందని అంటున్నారు. దసరా బరిలో దిగుతున్న ఈ సినిమా పోటీ ఏ రేంజ్ లో ఉండబోతుందో టీజర్ తోనే చెప్పాలని చూస్తున్నారు.