
నందమూరి బాలకృష్ణ హీరోగా 101వ సినిమా పూరి జగన్నాధ్ డైరక్షన్ లో పైసా వసూల్ చేస్తున్నాడు. ఇక 102వ సినిమాగా కె.ఎస్ రవికుమార్ తో సినిమా స్టార్ట్ చేశాడు బాలయ్య బాబు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ పెట్టబోతున్నారట. ఇప్పటికే కళ్యాణ్ తన నిర్మాణ సంస్థలో రూలర్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడట అది కచ్చితంగా బాలయ్య సినిమా కోసమే అని అంటున్నారు.
ఎన్.టి.ఆర్ దమ్ము సినిమాలోని రూలర్ పాట ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. ఆ సినిమాలోని రూలర్ టైటిల్ తో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా చేయాలని అనుకున్నాడు కాని ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. ఇక ఇప్పుడు ఆ టైటిల్ బాలయ్య చేతిలోకి వచ్చింది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరి రూలర్ గా బాలయ్య ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.