
యంగ్ రెబల్ స్టార్ ఎంతమంది హీరోయిన్స్ తో నటించినా అతని పక్కన స్వీటీ అనుష్క అంటే అదో స్పెషల్ క్రేజ్ అన్నట్టే. బిల్లా నుండి బాహుబలి దాకా ఇద్దరిది హిట్ అండ్ హాట్ పెయిర్. అందుకే దర్శక నిర్మాతలు ఈ ఇద్దరిని పెట్టి మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని చూస్తారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో. యువి ఆర్ట్స్ క్రియేషన్స్ లో వస్తున్న ఈ సినిమా సుజిత్ డైరక్షన్ లో వస్తుంది.
150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న ఈ సినిమా తెలుగు తమిళ హింది భాషల్లో నిర్మితమవుతుంది. సినిమా టీజర్ టైంలో హీరోయిన్ ను ఫైనల్ చేయలేదు అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం సాహోలో కూడా అనుష్క హీరోయిన్ గా ఫైనల్ చేశారట. సాహోలో హీరోయిన్ గా ఎవరెవరో పేర్లు వినపడ్డా అనుష్కతోనే ప్రభాస్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.