త్రివిక్రం ఆ హీరోయిన్ కు కనెక్ట్ అయ్యాడు..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం సినిమాలో ఛాన్స్ అంటే హిట్ సినిమాకు లక్ తగిలినట్టే. అందుకే త్రివిక్రం ఓకే అనాలే కాని తన సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఎంతోమంది క్యూలో ఉన్నారు. అయితే వారినెవరిని కాదని త్రివిక్రం మాత్రం ఒక కొత్త అమ్మాయి వెంట పడుతున్నాడట. మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన ఆమె కుర్ర హీరో సినిమాలను చేస్తుంది. సడెన్ గా త్రివిక్రం పవన్ కళ్యాణ్ సినిమా ఛాన్స్ వచ్చేసరికి లక్ తగిలినట్టైంది.

ఇంతకీ త్రివిక్రంకు అంతగా నచ్చిన ఆ హీరోయిన్ ఎవరు అంటే అను ఎమాన్యుయెల్ అని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న  సినిమాలో అను హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇందులో కీర్తి సురేష్ కూడా మరో హీరోయిన్ గా చేస్తుందనుకోండి. ఆ సినిమాలో అను ఎమ్మాన్యుయెల్ నటన చూసిన త్రివిక్రం తాను తర్వాత తారక్ తో చేసే సినిమాలో కూడా ఆమెకే ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట.

పవన్ సినిమా ముగించుకుని తారక్ తో సినిమాకు రెడీ అవుతున్న త్రివిక్రం ఇప్పటికే ఎన్.టి.ఆర్ కు కథ చెప్పడం దానికి తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతా జరిగిందట. సో ఆ సినిమాలో ఎంతమంది హీరోయిన్స్ అన్నది చెప్పలేం కాని అను మాత్రం ఒక హీరోయిన్ గా ఫైనల్ అయినట్టే.