
మెగా హీరోల్లో దూకుడు మీదున్న మేనళ్లుడు సాయి ధరం తేజ్ గురించి అందరికి తెలిసిందే. మొదటి రెండు సినిమాలతోనే మెగా ఫ్యాన్స్ ను వల్లో వేసుకున్న ఈ కుర్రాడు ఇప్పుడు బివిఎస్ రవి డైరక్షన్ లో జవాన్ గా రాబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత క్రేజీ డైరక్టర్ వినాయక్ తో సినిమా తీస్తున్నాడు తేజ్. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గా దుర్గా అని పెట్టబోతున్నారట.
ఇప్పటిదాకా మాస్ సినిమాలు చేసినా ఇప్పుడు అసలు సిసలైన మాస్ డైరక్టర్ తో సినిమా చేస్తున్న తేజ్ మాస్ ఫ్యాన్స్ ను అలరిస్తాడని చెప్పొచ్చు. మెగా హీరోలకు సూపర్ హిట్ ఇచ్చిన వినాయక్ మొదటిసారి సాయి ధరం తేజ్ తో సినిమా చేస్తున్నాడు. సినిమా టైటిల్ దుర్గా పేరులోనే ఓ మాస్ వైబ్రేషన్స్ ఉన్నాయి.
ఖైది నంబర్ 150 తర్వాత వినాయక్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. సాయి ధరం తేజ్, వినాయక్ కాంబినేషన్ లో సినిమా కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మిగతా డీటేల్స్ త్వరలో వెళ్లడవుతాయని తెలుస్తుంది.