మళ్ళీ హనుమాన్... ఈసారి 3డీలో

ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్‌ 2024లో విడుదలైన సూపర్ హిట్ సినిమా హనుమాన్ ఈసారి 3డీలో ఈ నెల 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హనుమాన్ 3డీ వెర్షన్ ట్రైలర్‌ నిన్న విడుదల చేశారు. హనుమాన్‌లో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి కనుక ఈ సినిమాని 3డీలో థియేటర్లలో చూడటం గొప్ప అనుభూతినిస్తుంది. 

ఈ సినిమాలో తేజా సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్, దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్లె, సంగీతం: గౌర హరి, అనుదీప్ దేవరకొండ, కృష్ణ సౌరభ్, కెమెరా: శివేంద్ర, ఎడిటింగ్: ఎస్‌బి. రాజు తలారి చేశారు.