ప్లీజ్ అలాంటివి రాసి బాధపెట్టొద్దు : రవితేజ

స్టార్ హీరో రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భరత్ అంత్యక్రియలకే కాదు కనీసం భౌతిక ఖాయం చూసేందుకు కూడా రవితేజ అతని కుటుంబ సభ్యులెవరు రాలేదు. ఇక భరత్ సంస్మరణ రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడారు రవితేజ. తమ్ముడి మరణించిన బాధలో తాము ఉంటే సోషల్ మీడియాలో వార్తలు ఎంతో బాధపెట్టాయని. 

ఇలాంటి వార్తలు రాసే ముందు దయచేసి తెలుసుకుని రాయండి అంతేకాని యూట్యూబ్ లో హిట్లు కోసం ఇంత ఘోరంగా రాయకండని అన్నారు రవితేజ. కేవలం భరత్ ను అలా చూడలేకనే రాలేదు తప్ప మిగతా కారణాలు ఏవి లేవన్నారు. ఇక అంత్యక్రియలను ఓ జూనియర్ ఆర్టిస్ట్ చేత చేయించారు అన్న దాని మీద కూడా వివరణ ఇస్తూ అలాంటి వన్ని రాంగ్ న్యూస్ అని.. అంత కర్మ మాకు పట్టలేదని అన్నారు. భరత్ అంత్యక్రియలు తమ్ముడు, చిన్నాన్న దగ్గరుండి చూసుకున్నారని చెప్పారు. దయచేసి ఇక మీదట ఇలాంటి వార్తలు రాసేముందు కాస్త నిజం తెలుసుకుని రాయండని రవితేజ చెప్పారు. అయితే తాను ఇక్కడ ప్రస్తావించింది కొంతమంది గురించి మాత్రమే అని అందరిని కాదని అన్నారు.