
టాలీవుడ్ లో ఊర మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన దర్శకుడు బోయపాటి శ్రీను ఊర మాస్ ఇమేజ్ కోసం ప్రాకులాడే స్టార్ హీరోలకు బెస్ట్ డైరక్టర్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ సరైనోడుతో స్టైలిష్ స్టార్ కు అదిరిపోయే హిట్ అందించిన బోయపాటి ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా జయ జానకి నాయకా సినిమా చేస్తున్నాడు.
ఇక ఆ సినిమా తర్వాత కొద్ది పాటి గ్యాప్ తో చిరు సినిమా చేసే అవకాశాలున్నాయట. అంతేకాదు ఈమధ్యనే సూపర్ స్టార్ మహేష్ కు బోయపాటి శ్రీను ఓ అదిరిపోయే కథ చెప్పాడట. మురుగదాస్ తో స్పైడర్ పూర్తి చేసుకున్న మహేష్ కొరటాల శివతో భరత్ అను నేను సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఇక అదే కాకుండా డిసెంబర్ లో వంశీ పైడిపల్లితో సినిమా కూడా స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ తర్వాత మాత్రమే బోయపాటి శ్రీనుతో మహేష్ చేసే ఛాన్స్ ఉంది. ఈలోపు బోయపాటి కూడా చిరు సినిమా చేసి మళ్లో స్టార్ హీరో సినిమా కూడా చేయొచ్చు. తనకున్న ఫాలోయింగ్ లో ఊర మాస్ ఆడియెన్స్ ను వదిలేసిన మహేష్ వారి కోసమే బోయపాటి లాంటి డైరక్టర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.