కళ్యాణ్ రాం స్టైలిష్ ఎమ్మెల్యే..!

నందమూరి కళ్యాణ్ రాం ప్రస్తుతం చేస్తున్న సినిమా ఎం.ఎల్.ఏ. ఉపేంద్ర మాధవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కొద్ది గంటల క్రితం రిలీజ్ చేశారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లో స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు కళ్యాణ్ రాం. ఇజం ఫ్లాప్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రాం ఉపేంద్ర చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాడట. 


నేనే రాజు నేనే మంత్రి లాంటి డిఫరెంట్ సినిమా చేసిన కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిలు కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ సినిమా నిర్మిస్తుండటం విశేషం. ఎం.ఎల్.ఏ అంటే అసెంబ్లీ కథ అనుకుంటే పొరపాటే అందుకే క్లారిటీ కోసం మంచి లక్షణాలున్న అబ్బాయి అని ట్యాగ్ లైన్ తగిలించారు. ఓ పక్క హీరో గానే కాదు నిర్మాతగా కూడా కళ్యాణ్ రాం సమానంగా కెరియర్ ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రాం ఎన్.టి.ఆర్ జై లవకుశ సినిమా నిర్మిస్తున్నారు.