
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ జూలై 16 నుండి స్టార్ మాలో ప్రసారం అవనుంది. హిందిలో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ అన్ని సౌత్ లాంగ్వెజెస్ కు విస్తరించారు. ఇప్పటికే తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తుండగా మొదటి ఎపిసోడ్ అక్కడ అంతగా ఆదరణ దక్కించుకోలేదని టాక్.
ఇక ఈమధ్యనే ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ కు సంబందించిన పొస్టర్స్, టీజర్లు రిలీజ్ చేశారు. బుల్లితెర మీద కూడా బాద్షా తన వీర ప్రతాపం చూపించనున్నాడు. భారీ రెమ్యునరేషన్ తో ఎన్.టి.ఆర్ ను తీసుకున్న స్టార్ మా ఎలాగైనా సరే తెలుగులో ఈ షో క్లిక్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన బిగ్ బాస్ షోలో ఎన్.టి.ఆర్ ఎలా ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. ముఖ్యంగా ఈ షోలో ఎవరెవరు ఉంటున్నారన్న దాని మీద పెద్ద చర్చే నడుస్తుంది. ముంబైలో షూట్ చేసుకున్న బిగ్ బాస్ తొలి ఎపిసోడ్ జూలై 16 నుండి టెలికాస్ట్ అవనుంది. సోమవారం నుండి శుక్రవారం దాకా రాత్రి 9:30 నిమిషాలకు.. శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారమవనుందట.