వర్మ డైరక్షన్ లో ఎన్టీఆర్ బయోపిక్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథ సిద్ధం చేస్తున్నారన్న బాలయ్య బాబు ఇక సినిమా దర్శకుడిగా రాం గోపాల్ వర్మను ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఈ విషయం స్వయంగా వర్మ ఎనౌన్స్ చేయడం విశేషం. అంతేకాదు తన మార్క్ ఎమోషనల్ డైలాగ్స్ తో వర్మ ఎన్.టి.ఆర్ జీవిత చరిత్ర తీస్తున్నాడని చెప్పిన ఆడియో బిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. 

తెలుగువాడిని తలేత్తుకునేలా చేసింది ఎన్.టి.ఆర్ అనే మూడు అక్షరాలు. అతి మాములు మనిషి అయిన నేను ఇప్పుడు ఆయన బయోపిక్ ను తెరకెక్కించడం గర్వంగా ఫీల్ అవుతున్నాని అన్నారు. ఇక ఈ సినిమాలో ఆయన శత్రువులెవరో, నమ్మక ద్రోహులెవరో, ఎవరికి తెలియని కాంట్రవర్సీలు వాటి వెనకాల ఉన్న కాంట్రవర్సీలను కూడా సినిమాలో చూపిస్తా అంటూ వర్మ ప్రకటించాడు. అంతేకాదు జై ఎన్.టి.ఆర్ జై ఎన్.టి.ఆర్ అంటూ ఓ సాంగ్ కూడా కంపోజ్ చేయించడం విశేషం. వర్మ ఆలపించిన ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది.