
విలక్షణ నటుడు సూర్య సింగం-3 గా ఆకట్టుకోలేకపోయినా మరోసారి తన విలక్షణత చూపించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో మూవీ చేస్తున్న సూర్య ఆ తర్వాత సుధ కొంగర డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేశాడు. ఈ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తుండగా సినిమాలో సూర్య పైలెట్ గా కనిపించబోతున్నాడని టాక్.
ఇప్పటికే సూర్య తమ్ముడు కార్తి మణిరత్నం చెలియా సినిమాలో ఆల్రెడీ పైలెట్ గా కనిపించాడు. అయితే ఆ సినిమా ఆశించినంత సక్సెస్ అవ్వలేదు. అందుకే ఈసారి సూర్య పైలెట్ గా అదరగొట్టాలని చూస్తున్నాడు. మాధవన్ తో ఇరుదు సూత్రు, అదే తెలుగులో గురుగా వెంకటేష్ తో తీసి హిట్ అందుకున్న సుధ కొంగర అదిరిపోయే కథతో సూర్యని ఇంప్రెస్ చేసిందట.
24 లాంటి ప్రయోగాత్మక సినిమా తీసిన సూర్య ఆ సినిమాను కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేదు. ఇక ఎస్-3 కూడా అంచనాలను అందుకోలేకపోయింది. అందుకే సుధ కొంగర డైరక్షన్ లో సినిమాకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.