
నాచురల్ స్టార్ నాని నటించిన నిన్ను కోరి మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా దర్శకుడు శివ నిర్వాణ ఈ కథను మూడేళ్ల క్రితమే నానికి వినిపించాడట. పైసా ఫ్లాపులో ఉన్న నాని సినిమా కథ తర్వాత చేద్దామని అలాగని ఈ కథ ఎవరికి ఇవ్వొద్దని మరి దర్శకుడికి కమిట్మెంట్ ఇచ్చాడట నాని.
డివివి దానయ్య కోనా వెంకట్ నిర్మించిన ఈ సినిమాలో నానికి జతగా నివేతా థామస్ నటించింది. సినిమాలో ఆది పినిశెట్టి కూడా సెకండ్ లీడ్ క్యారక్టర్ చేశాడని తెలుస్తుంది. నేను లోకల్ తో సూపర్ హిట్ అందుకున్న నాని నిన్ను కోరి మీద ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. మరి మూడేళ్ల క్రితం రాసుకున్న ఈ కథ ఎంతమేరకు ప్రేక్షకులకు చేరువవుతుందో చూడాలి.
నాని సినిమాకు ఎన్నడు లేని విధంగా ప్రీ రిలీజ్ బజ్ ఏర్పరచుకుంది నిన్ను కోరి మూవీ. అంతేకాదు సెన్సార్ నుండి క్లీన్ యు సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా హిట్ పై నాని ధైర్యంగా ఉన్నాడు.