
తెలుగు సినిమాల్లో బూతు అనేది బాగా వినిపిస్తుంది. నడుస్తున్న ట్రెండ్ అలాంటిది అంటూ దర్శకులు తమని తాము సమర్ధించుకున్నా కేవలం అలాంటి సినిమాలు తీస్తేనే చూస్తారనుకున్న ప్రేక్షకులు నాకొద్దు అంటున్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన సినిమా అమితుమి. అడివి శేష్, వెన్నెల కిశోర్, అవసరలా శ్రీనివాస్, ఈష రెబ్బా కలిసి నటించిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 65 కేంద్రాల్లో 25రోజులు పూర్తి చేసుకుంది.
ఆరోగ్యకరమైన కామెడీతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సినిమా చిన్న బడ్జెట్ తో నిర్మించబడింది. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలే తీసుకురాగా శాటిలైట్ రూపంలో కూడా రెండున్నర కోట్లకు అమ్ముడవడం విశేషం. ఈ ఇయర్ చిన్న సినిమాల్లో పెద్ద విజయం అందుకున్న అమీతుమీ సక్సెస్ రానున్న చిన్న సినిమాలకు స్పూర్తి ఇచ్చిందని చెప్పొచ్చు.