చైతు టైటిల్ 'యుద్ధం శరణం'..!

అక్కినేని యువ హీరో నాగ చైంతన్య హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ సాయి కొర్రపాటి నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా సక్సెస్ తర్వాత చైతు చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ గా యుద్ధం శరణం అని ఫిక్స్ చేశారట.

రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధం సినిమాలో బన్ని చెప్పిన యుద్ధం శరణం గచ్చామి అన్న డైలాగ్ స్పూర్తితోనే కథకు తగ్గట్టుగా యుద్ధం శరణం పెట్టారట. నూతన దర్శకుడు కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమా రిలీజ్ కూడా దసరా సీజన్ లో ప్లాన్ చేస్తున్నారట. రారండోయ్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన చైతు ఆ హిట్ మేనియా కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. 

ఇక ఈ సినిమా తర్వాత ప్రేమం డైరక్టర్ చందు మొండేటి సినిమా ఫిక్స్ చేసుకున్న చైతు. ఆ సినిమా మైత్రి మూవీ బ్యానర్లో నటిస్తుండటం విశేషం. ఇక ఆ తర్వాత ఓ లేడీ డైరక్టర్ తో సినిమా చేస్తున్నాడని టాక్. కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సౌజన్య డైరక్షన్ లో ఈ సినిమా ఉండబోతుందట.