
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకుంటే కచ్చితంగా రాజకీయాల్లో రానించే వాడని తన మనసులోని మాట చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. రీసెంట్ గా రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నెంబర్ 1 యారి షోకి గెస్ట్ గా వచ్చిన రాజమౌళి స్టార్ హీరోలు ఇండస్ట్రీకి రాకుంటే ఏయే రంగాల్లో రానించే వారో తనకున్న ఐడియాలజీ ప్రకారం చెప్పాడు.
ముందు ప్రభాస్ మంచి చెఫ్ గా పనికొస్త్తాడన్న రాజమౌళి ఎన్.టి.ఆర్ మాత్రం సినిమాల్లోకి రాకున్నా మహానేతగా రాజకీయాల్లో రానించగలడని అన్నారు. ఇక రాం చరణ్ మాత్రం హీరో కాకుంటే బిజినెస్ బాగా చేస్తాడని అన్నారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన జక్కన్న ఆ సినిమా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మంచి రిలేషన్ ఉంది.
ఇక బాహుబలి తర్వాత రాజమౌళి తీసే సినిమా కూడా ఎన్.టి.ఆర్ తోనే అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్ లో జై లవకుశ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఎవరితో చేస్తాడు అన్నది పెద్ద కన్ ఫ్యూజన్ ఏర్పడింది.