బోయపాటి సినిమాపై నాగార్జున క్లారిటీ..!

కింగ్ నాగార్జున బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని నాగ చైతన్యకు మాస్ ఇమేజ్ తెప్పించేందుకు ఏకంగా 12 కోట్ల దాకా బోయపాటికి రెమ్యునరేషన్ ఇచ్చేస్తున్నాడని నిన్న మొన్నటి న్యూస్. కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయకా సినిమా తీస్తున్న బోయపాటి శ్రీను ఆ తర్వాత నాగ చైతన్యతోనే సినిమా చేస్తున్నారని మీడియా హడావిడి చేసింది.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పేశాడు నాగార్జున. రీసెంట్ గా రారండోయ్ వేడుక చూద్దాం సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చైతు అండ్ నాగ్ బోయపాటితో సినిమా చేయాలన్ అనుకోలేదని ఆ వార్త ఎలా పుట్టించారో తెలియలేదని అంటున్నాడు. ఇక ప్రస్తుతం అఖిల్ తో సినిమా నిర్మిస్తున్న నాగ్ ఆ సినిమా తర్వాత ఇక తనయుల సినిమాలు తాను ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదంటున్నారు. 

అఖిల్ సినిమా కోసం దాదాపు 45 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్న నాగ్ ఇక ఇప్పుడప్పుడే తన నిర్మాణంలో నాగ చైతన్య, అఖిల్ సినిమాలు వచ్చే ఛాన్స్ లేదని క్లారిటీ ఇచ్చాడు. సో బోయపాటితో చైతు సినిమా ఒట్టి గాసిప్పే అన్నమాట.