
మెగా పవర్ స్టార్ రాం చరణ్ క్రేజీ డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ ప్రేమకథలో చరణ్ పల్లెటూరి అబ్బాయిగా నటిస్తున్నాడు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబందించి ఓ బోర్డ్ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
చిత్రయూనిట్ జరిగే ఏరియాలో రంగస్థల నాయకుడు అభిమన్యు నారాయణ అని రాసి ఉంది. అంటే ఇందులో చరణ్ అభిమన్యు నారాయణగా నటిస్తున్నాడా రంగస్థల నాయకుడు అంటే నాటకాలేసే వాడుగా చెర్రి కనిపిస్తాడా అంటూ ఒకటే హడావిడి చేస్తున్నారు మెగా అభిమానులు. సినిమాలో చెర్రి డిఫరెంట్ విలేజ్ గెటప్ లో కనిపించబోతుండగా అతనికి వినికిడి లోపం కూడా ఉంటుందని అంటున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తుండటం విశేషం. చరణ్ తో సమంత మొదటి సారి జత కడుతున్న ఈ సినిమాపై తను కూడా సూపర్ ఎక్సైటెడ్ గా ఉందని తెలుస్తుంది. 2018 సంక్రాంతికి రిలీజ్ అవనున్న రంగస్థలం 1985 అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.