ప్రభుదేవతో ప్రభాస్.. పెద్ద రిస్కే చేస్తున్నాడు..!

యంగ్ రెబల్ స్టార్ బాహుబలి తర్వాత తన రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే. దర్శక నిర్మాతలంతా ప్రభాస్ తో సినిమా చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ డైరక్షన్ లో సాహో మూవీ చేస్తుండగా ఆ తర్వాత మూవీ ఇండియన్ మైకెల్ జాక్సన్ ప్రభుదేవతో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే వీరిద్దరు కలిసి పౌర్ణమి సినిమా తీశారు. ఆ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయినా ప్రేక్షకులను నిరాశ పరచింది.

బాహుబలి తర్వాత సుజిత్ లాంటి చిన్న డైరక్టర్ తోనే ప్రభాస్ సినిమా చేయడం ఏంటని ఆశ్చర్యపోతుంటే తనకు ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ తో సినిమా చేయాలనుకోవడం తో ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. ప్రభాస్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉన్న ప్రభుదేవ ఇప్పటికే కథ వినిపించడం దానికి ప్రభాస్ ఓకే చెప్పడం అంతా జరిగిందట. 

ప్రభుదేవతో చేసే ప్రభాస్ సినిమా తెలుగు తమిళ హింది భాషల్లో ఉండబోతుందని టాక్. తెలుగు సినిమాల దర్శకత్వం వదిలేసిన ప్రభుదేవ ఆ తర్వాత హిందిలో సినిమాలను డైరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఇక ప్రస్తుతం అతని కన్ను మళ్లీ ప్రభాస్ మీద పడింది. బాహుబలితో ఇండియన్ సినిమాను ఒక్క తాటిపై తెచ్చిన ప్రభాస్ తో సినిమా తీసి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు ప్రభుదేవ మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.