యూఎస్ లో 600 ప్రీమియర్స్.. కొత్త సంచలనాలతో నాని..!

నాచురల్ స్టార్ నాని క్రేజ్ సినిమా సినిమాకు అమాంత పెరిగిపోతుంది అందుకు నిదర్శనం యూఎస్ లో నాని సినిమాకు పెరుగుతున్న ఆదరణే అని చెప్పొచ్చు. రీసెంట్ గా నేను లోకల్ తో హిట్ అందుకున్న నాని ఈ నెల 7న నిన్ను కోరి సినిమాతో రాబోతున్నాడు. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య, కోనా వెంకట్ కలిసి నిర్మించారు. ఈ సినిమా నాని కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా 150 సెంటర్స్ లో రిలీజ్ అవుతుందని టాక్.  

అంతేకాదు జూలై 6న దాదాపు 600 ప్రీమియర్స్ పడే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ రేంజ్ లో ప్రీమియర్స్ కేవలం స్టార్ హీరోలకు మాత్రమే సో ఈ లెక్కన నాని నాచురల్ స్టార్ గా సూపర్ ఇమేజ్ దక్కించుకున్నట్టే. నానితో పాటు నివేతా థామస్ ఫీమేల్ లీడ్ చేయగా సినిమాలో సెకండ్ హీరోగా ఆది పినిశెట్టి నటించాడు.

కథ చెప్పగానే శివని ప్రోత్సహించడమే కాకుండా సినిమా నిర్మాణంలో భాగమయ్యాడు రచయిత కోనా వెంకట్. ఇక ఈ సినిమా విషయంలో నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అందుకే రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తప్పకుండా మనసుల్లో దాచుకునేలా సినిమా ఉంటుందని ఒట్టేసి మరి చెప్పాడు. గోపిసుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ శ్రోతలను అలరిస్తున్నాయి.