అవార్డులతో సంచలనం సృష్టిస్తున్న ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాస్ట్ ఇయర్ చేసిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలకు గాను ఆ సినిమాలు హిట్ సాధించడమే కాదు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నాడు. రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న తారక్ ఆ తర్వాత ఐఫాలోనూ బెస్ట్ యాక్టర్ గా సత్తా చాటాడు. ఇక జీ సినిమాలు, శకరాభరణం అవార్డులతో పాటుగా ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న సీమా అవార్డుల్లో కూడా యంగ్ టైగర్ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నాడట.

సీమా 2017 అబుదాబిలో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డుల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ అవార్డులు ఇవ్వ బడతాయి. ఎన్.టి.ఆర్ నటించిన జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో సినిమాల నుండి తారక్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందించడం జరిగింది. ఈ అవార్డుతో ఈ సంవత్సరం బెస్ట్ యాక్టర్ గా మొత్తం అవార్డులను అందుకున్న ఏకైక హీరోగా ఎన్.టి.ఆర్ రికార్డుల్లో కెక్కాడు.

ప్రస్తుతం తారక్ నటిస్తున్న సినిమా జై లవకుశ. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఈ నెల 5న రిలీజ్ చేయనున్నారట. రాశి ఖన్నా, నివేతా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న జై లవకుశ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు.