మహేష్ మురుగదాస్ డిష్యుం డిష్యుం..!

సూపర్ స్టార్ మహేష్ క్రేజీ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. టైటిల్ విషయంలోనే అభిమానుల సహనానికి పరిక్ష పెట్టిన ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా అలాంటి సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది. అసలైతే సెప్టెంబర్ 23 కల్లా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినా అది ఇంకా లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట.

ఇక ఈ విషయంపై మురుగదాస్ తో మహేష్ ఫైటింగ్ కు దిగాడని ఇన్నర్ టాక్. తెలుగు తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ లేట్ అయ్యిందని భావిస్తున్నాడు మహేష్. ఓ పక్క చిత్రనిర్మాతలు సెప్టెంబర్ రిలీజ్ పక్కా అని అంటున్నా సరే మురుగదాస్ మాత్రం ఇంకా సినిమాను చెక్కుతూనే ఉన్నాడట. ఈ విషయంలో మురుగదాస్ కు మహేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట. అనుకున్నట్టుగా సెప్టెంబర్ కల్లా ఎట్టిపరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నాడట.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ హైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపుఇ 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని అంటున్నారు.