స్పైడర్ దసరాకి పక్కా..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్ రిలీజ్ పై ఇప్పటిదాకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. సెప్టెంబర్ లో రిలీజ్ అని చెప్పినా ఇంకా ఫైనల్ డేట్ ఎనౌన్స్ చేయలేదు. ఈ లోపే సెప్టెంబర్ 21న ఎన్.టి.ఆర్ జై లవకుశ రిలీజ్ ఫిక్స్ చేసేసరికి కచ్చితంగా సెప్టెంబర్ లో మహేష్ స్పైడర్ రిలీజ్ కష్టమే అనుకున్నారు. ఇదే విషయంపై సినిమా నిర్మాత ఠాగూర్ మధుతో మహేష్ అభిమానులు ట్విట్టర్ లో ప్రస్తావించగా సెప్టెంబర్ లో మహేష్ స్పైడర్ రిలీజ్ పక్కా అని చెప్పేశారు.

అయితే రిలీజ్ డేట్ మాత్రం సెప్టెంబర్ 22 లేదా 27న గాని ఉండొచ్చని అన్నారు. ఠాగూర్ మధు ఇచ్చిన కన్ఫర్మేషన్ కు మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవబోతున్న స్పైడర్ కు అటు తమిళంలో ఇటు తెలుగులో గట్టి పోటీ ఏర్పడనుంది. స్పై ఏజెంట్ గా మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 130 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమా హిందిలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.