జయ జానకి నాయకా ఫస్ట్ లుక్.. బోయపాటిలో ఇంతమార్పెలా..!

బోయపాటి శ్రీనివాస్ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీను హీరోగా చేస్తున్న సినిమా జయ జానకి నాయకా. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్ గా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ కొద్ది నిమిషాల క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. బైక్ మీద రకుల్, రోడ్డు మీద కూర్చున్న హీరో చూస్తుంటే బోయపాటి సినిమాలా మాత్రం అనిపించట్లేదు.

ఎప్పుడు కత్తులతో సావాసం చేసే బోయపాటి ఈ సినిమాతో కొత్త ప్రయోగం చేస్తున్నాడని చెప్పొచ్చు. హీరోలకు మాస్ ఇమేజ్ ఇవ్వడంలో దిట్టైన బోయపాటి బెల్లంకొండ బాబు కోసం క్లాసీ మూవీ చేస్తున్నాడని అనిపిస్తుంది. ఫస్ట్ లుక్ అయితే చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఆగష్టు 11న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఆడియో త్వరలో రిలీజ్ చేయనున్నారు.