
కోలీవుడ్ క్రేజీ బ్యూటీ నయనతార సోలో సినిమాలతో సూపర్ ఫాంలో ఉంది. ప్రయోగాత్మక సినిమాలతో సూపర్ పాపులర్ అయిన నయనతార ఓ వైపు కమర్షియల్ సినిమాలకు సెంటారాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. కోలీవుడ్ లో అడపాదడపా స్టార్స్ తో నటిస్తున్న నయనతార టాలీవుడ్ ఆఫర్ వస్తే మాత్రం ఆకాశాన్నంటే పారితోషికం డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ పూరిల పైసా వసూల్ పూర్తి కాగానే తర్వాత కె.ఎస్ రవికుమార్ తో తీసే సినిమాకు హీరోయిన్ గా నయన్ ను అడిగారట.
ఆ సినిమా ముందు కాదనేసినా డైరక్టర్ రవికుమార్ కాబట్టి కాదనలేక రెమ్యునరేషన్ 3 కోట్లయితేనే చేస్తా అన్నదట. అంతేకాదు ఆడియో, ప్రమోషన్స్ లాంటివాటికి అసలు వచ్చే ప్రసక్తే లేదని చెబుతుందట. ఇన్ని ఆంక్షలు పెట్టినా అమ్మడిని ఓకే అనేశారట చిత్రయూనిట్. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించే అవకాశాలున్నాయట. సింహా, శ్రీరామరాజ్యం తర్వాత బాలయ్యతో నయనతార తప్పకుండా మళ్లీ హిట్ కొడతారని ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉన్నారు.