డిజె డైరక్టర్ కు మెగాస్టార్ ఛాన్స్ ఇస్తాడా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం తీసిన డైరక్టర్ హరిష్ శంకర్ సినిమాతో తన ఖాతాలో హిట్ వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం డిజె ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న హరిష్ శంకర్ ఛాన్స్ వస్తే మెగాస్టార్ తో సినిమా తీస్తా అంటున్నాడు. పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి హిట్ అందుకున్న హరిష్ ఆ తర్వాత ఎన్.టి.ఆర్ తో రామయ్యా వస్తావయ్య తీసినా అంతగా ఆడలేదు. ఇక మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో సుబ్రమణ్యం ఫర్ సేల్ పర్వాలేదు అనిపించుకోగా రీసెంట్ గా వచ్చిన డిజె మాత్రం హరిష్ శంకర్ ను మళ్లీ స్టార్ డైరక్టర్ గా నిలబెట్టింది.

సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలక్షన్స్ రావడంతో హరిష్ కెరియర్ లో ఇది ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుందని అంటున్నారు. ఇక ప్రమోషన్స్ లోనే పవర్ స్టార్ తో మల్లెప్పుడు తీస్తారు అంటే అందుకు కథ సిద్ధం లేదు కాని  చిరంజీవి కోసం అయితే కథ ఎప్పుడో సిద్ధం చేసుకున్నానని అంటున్నాడు హరిష్. మరి చిరు హరిష్ కు ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి. కమర్షియల్ సినిమాలు తీయడంలో తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ ఏర్పరచుకున్న హరిష్ కు మెగాస్టార్ ఆఫర్ ఎప్పుడు పలుకరిస్తుందో చూడాలి.