
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ మా టివి నుండి స్టార్ మా గా మార్పు పొందగా అందులో ఏకంగా 80 మంది ఉద్యోగులను తీసేస్తున్నారన్న వార్త ప్రస్తుతం హాట్ న్యూస్ గా నిలిచింది. ఎన్నాళ్ల నుండో అదే ఛానెల్ లో పనిచేస్తున్న వారిని కాదని కొత్తగా వచ్చిన స్టార్ మా యాజమాన్యం కొత్త వారిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలో 7-8 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారందరిని తీసేస్తున్నట్టు ప్రకటించారట.
అయితే ఈ విషయం ఉద్యోగులకు ముందే చెప్పారట కూడా. మా టివి స్టార్ మా చేతుల్లోకి వెళ్లగానే అందులోని ఉద్యోగులకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. కొత్త వారికి అవకాశం ఇచ్చే ఉద్దేశంతోనే స్టార్ మా ఇలా తమ ఉద్యోగులను తీసేస్తున్నారని అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి మీలో ఎవరు కోటిశ్వరుడు ప్రోగ్రాం తో స్టార్ మా ప్రసారాలు మొదలుపెట్టగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో బిగ్ బాస్ ప్రోగ్రాం కూడా షూట్ చేస్తున్నారు.