నాని రెమ్యునరేషన్ వింటే షాక్ అవ్వాల్సిందే..!

నాచురల్ స్టార్ నాని ఫాం ఏంటో అతని సినిమాల విజయాలను చూస్తే తెలిసిపోతుంది. అష్టా చమ్మా నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఇయర్ నేను లోకల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని సినిమాతో రెమ్యునరేషన్ కూడా పెంచాడని తెలుస్తుంది. నిన్న మొన్నటిదాకా 3 కోట్లు తీసుకున్న నాని నిన్ను కోరితో 4 కోట్లు తీసుకున్నారట.

అంతేకాదు రానున్న సినిమాలు 5 కోట్లు ఇస్తేనే అంటూ నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడట. బడ్జెట్ తో సంబంధం లేకుండా నాని సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. 15 కోట్ల బడ్జెట్ తో డబుల్ ప్రాఫిట్ తెస్తున్న నాని రెమ్యునరేషన్ పెంచడం పెద్ద విషయం కాదని అంటున్నారు. ఈమధ్యనే ఓ విల్లాను కొన్న నాని చూస్తుంటే స్టార్ స్టేటస్ పొందేందుకు దగ్గరలోనే ఉన్నాడని చెప్పొచ్చు.