
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా పాగా వేయాలనుకుంటున్న మన హీరోయిన్స్ ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారని చెప్పొచ్చు. తెలుగులో సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన యూత్ ఫుల్ మూవీ 100% లవ్ తమిళ్ లో రీమేక్ అవుతుంది. సినిమాలో హీరోగా మ్యూజిక్ డైరక్టర్ జివి ప్రకాశ్ నటిస్తుండగా హీరోయిన్ గా ముందు తమన్నాను అనుకున్నా ఆమె ఎందుకో ఆ ప్రాజెక్ట్ కాదనేసింది.
ఇక ఆ తర్వాత లావణ్య త్రిపాఠి, హెబ్భా పటేల్ లాంటి హీరోయిన్స్ పేర్లు వినపడ్డాయి. హెబ్బా దాదాపు ఓకే అనుకున్నా చివరి నిమిషంలో ఆ ఛాన్స్ లావణ్య దక్కించుకుందట. ఇక కాలేజ్ అమ్మయిగా కనబడేందుకు లావణ్య ఇప్పటికే ఫిట్ నెస్ ప్రిపరేషన్ లో ఉందట అమ్మడు. ఎం.ఎం.చంద్రమౌళి డైరక్షన్ లో రాబోతున్న 100% లవ్ తెలుగులో అందుకున్న విజయం అక్కడ అందుకుంటుందో లేదో చూడాలి.