
సుందర్ సి డైరక్షన్ లో సంఘమిత్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా ఓకే అయినా వివిధ కారణాల వల్ల ఆ సినిమా నుండి అమ్మడు బయటకు వచ్చింది. సినిమా కోసం కత్తి యుద్ధాలు కూడా నేర్చుకున్న శృతి సడెన్ గా సినిమా నుండి వాకవుట్ చేయడం అందరిని ఆశ్చర్యపరచింది.
ఆ తర్వాత ఆ పాత్ర కోసం అటు నయనతార దగ్గర నుండి అనుష్క వరకు అడిగినా లాభం లేదని తెలుస్తుంది. అందుకే ఫైనల్ గా ఆ రోల్ కోసం కోలీవుడ్ సూపర్ బ్యూటీ హాన్సికను సెలెక్ట్ చేశారట. దేశముదురుతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హాన్సిక కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. సంఘమిత్ర కోసం హాన్సిక అప్పుడే వర్క్ అవుట్ స్టార్ట్ చేసిందని టాక్. 200 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తున్నారు.