
డిజె సక్సెస్ తో హీరో అల్లు అర్జున్ కన్నా హీరోయిన్ పూజా హెగ్దె ఫుల్ హ్యాపీగా ఉందని తెలుస్తుంది. ఇదవరకే తెలుగులో రెండు సినిమాలు చేసినా అవి ఆశించినంత సక్సెస్ ఇవ్వకపోవడంతో డిజెపై భారీ హోప్స్ పెట్టుకుంది పూజా. ఇక సినిమా సక్సెస్ అయ్యి వసూళ్ల సునామి సృష్టిస్తుండగా అమ్మడికి లక్కీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం పూజా బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఆఫర్ గురించి తెలిసిందే.
ఇక ఇప్పుడు ఆ సినిమా అఫిషియల్ గా ఓకే చేసింది పూజా హెగ్దె. సినిమా కోసం అమ్మడు దాదాపు కోటి రూపాయలదాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో పూజా స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమంటున్నారు. ఇక ఇవే కాకుండా స్టార్ హీరోలు కూడా పూజానే ఫస్ట్ ఆప్షన్ అవుతుందని తెలుస్తుంది. మొత్తానికి అమ్మడికి డిజెతో లక్ అలా తగిలిందన్నమాట.