
నాచురల్ స్టార్ నాని హీరోగా మేర్లపాక గాంధి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే కథా చర్చలు ముగియడంతో ఫైనల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రస్తుతం నాని నటిస్తున్న వేణు శ్రీరాం ఎం.సి.ఏ సినిమా పూర్తి కాగానే నాని మేర్లపాక గాంధి డైరక్షన్ లో సినిమా చేస్తాడట. అయితే ఎక్స్ ప్రెస్ రాజా హిట్ తర్వాత మేర్లపాక గాంధి చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేశాడు చరణ్ కూడా అతనితో చేసేందుకు సిద్ధమైనా ఎందుకో మళ్లీ వెనక్కి తగ్గాడు.
ఇక ఇప్పుడు ఆ కథనే నానితో సినిమా చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. చరణ్ కథతో నాని సినిమా. అసలు చరణ్ ఇమేజ్ ఎక్కడ నాని ఇమేజ్ ఎక్కడ.. అలాంటిది చెర్రి కోసం రాసిన కథ నానికి ఎలా వాడుతున్నాడో అంటున్నారు. మరి మేర్లపాక గాంధి వచ్చి ఈ డౌట్ క్లారిఫై చేస్తే తప్ప దీనిపై ఓ ఫైనల్ నిర్ణయం వచ్చే అవకాశం లేదు.