
స్టార్ సినిమా చిన్న సినిమా అనే తేడా లేకుండా వారి ఆడియోని తమ మ్యూజిక్ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తుంటారు ఆదిత్య మ్యూజిక్. ఇక ఇప్పుడు వారు కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారని తెలుస్తుంది. కోలీవుడ్ హీరో కార్తి, క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న తీరన్ అధిగరమ్ ఒండ్రు సినిమా తెలుగు డబ్బింగ్ ఆదిత్య నిర్మాణంలోనే జరుగుతుందట.
యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను వినోద్ దర్శకత్వం వహించడం జరిగింది. జిబ్రన్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుందట. కాష్మోరా సినిమాతో తెలుగులో కూడా మంచి వసూళ్లను రాబట్టిన కార్తి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక మొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమా సక్సెస్ అయితే డైరెక్ట్ సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నారట.