
క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ టాలెంట్ అందరికి తెలిసిందే.. తను తీసే ప్రతి సినిమాలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించే కృష్ణ్వంశీ పై ఓ కొరియోగ్రాఫర్ నోరు పారేసుకున్నాడు. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీ పై నిప్పులు చెరిగాడు ఆ కొరియోగ్రాఫర్. ఇంతకీ కృష్ణవంశీని టార్గెట్ చేసింది ఎవరు అంటే రాకేష్ మాస్టర్ అని తెలుస్తుంది.
ఎన్నో సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ చక్రం సినిమాకు గాను కృష్ణవంశీ డైరక్షన్ లో జగమంత కుటుంబం నాది సినిమా కొరియోగ్రఫీ చేశారట. అయితే ఆ టైంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని కృష్ణవంశీ ఓ వె..ద..వ, బచ్చా డైరక్టర్ అంటూ కామెంట్లు చేశాడు రాకేష్ మాస్టర్. టెక్నిషియన్స్ కు విలువ ఇవ్వని డైరక్టర్స్ ఇండస్ట్రీలో ఉన్నారని. అందుకే ఇప్పుడు కృష్ణవంశీ రోడ్డున పడ్డాడని చెప్పుకొచ్చాడు. సంచలనంగా మారిన రాకేష్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి.