
సుకుమార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. సినిమా టైటిల్ చూసి హీరో నాటకాలేస్తాడు హీరోయిన్ ప్రేమించి ఆమెను ఎలా జయిస్తాడంటూ రకరకాల కథలు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే అసలు కథ ఏంటి దానికి రంగస్థలం అనే టైటిల్ ఎందుకు పెట్టారు అంటే. హీరో పేద కుర్రాడు.. పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇక ఈ కథ అంతా రంగస్థలం అనే ఊరిలో జరుగుతుందట.
సో మొత్తానికి ఊరి పేరునే టైటిల్ గా పెట్టుకున్నారు సుకుమార్ అండ్ టీం. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా సమంతకు సంబంధించిన పిక్ కూడా ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. మరి రంగస్థలం కథ మెగా అభిమానులకు ఏమేరకు నచ్చుతుందో చూడాలి. 2018 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్రయూనిట్ సినిమా షూటింగ్ జరుగుపుకుంటుంది.