జై లవకుశ టీజర్ లీక్.. ఇదంతా వారి పనే..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. నిన్న సాయంత్రం ఈ సినిమాకు సంబందించిన టీజర్, లీకెడ్ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వెంటనే ఈ విషయం గుర్తించిన చిత్రయూనిట్ సైబర్ క్రైం కు కంప్లైంట్ చేసింది. వెంటనే రంగంలో దిగిన పోలీసులు అనుమానితులను బందించారు. ఈ కేసులో గణేష్ అనే కుర్రాడిని ఇప్పటికే అరెస్ట్ చేయగా ఈ లీక్ లో ఇంకా ఎవరి హస్తమైనా ఉందని తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు.

ఇక లీక్ అయిన టీజర్, పోస్టర్ అయితే సినిమా మీద అంచనాలను పెంచేసింది. సినిమా కచ్చితంగా తారక్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకం లో నందమూరి కళ్యాణ్ రాం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశి ఖన్న, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సినిమాలో తారక్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.