మహేష్ మోస్ట్ డిజైరబుల్.. కాని..!

టాలీవుడ్ సూపర్ హ్యాండ్సం హీరోల్లో మహేష్ మొదటివాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే నేషనల్ వైడ్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో సౌత్ ఇండస్ట్రీ నుండి మహేష్ టాప్ 5 లో ఉంటాడు. ఇక ఈ సంవత్సరం టాప్ 5 స్థానంలో మహేష్ స్థానం దక్కించుకోలేదు. మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో మహేష్ ఈసారి 7వ స్థానంలో నిలిచాడు. 

ఈ లిస్ట్ లో మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్వాల్ ఆ తర్వాత స్థానాల్లో కొహ్లి, హృతిక్ రోషన్, రణ్ వీర్ సింగ్ ఉన్నారు. అయితే సౌత్ లో మాత్రం మహేష్ మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం మురుగదాస్ డైరక్షన్ లో స్పైడర్ మూవీ చేస్తున్న మహేష్ తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి ఆ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 130 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న ఆ సినిమా సైన్స్ ఫిక్షన్ గా రాబోతుంది. రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సెప్టెంబర్ 21న రిలీజ్ ప్లాన్ చేసుకున్న స్పైడర్ మళ్లీ పోస్ట్ పోన్ అంటూ వార్తలు వస్తున్నాయి.