
నాచురల్ స్టార్ నాని మరోసారి ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఇంతకీ నాని చేస్తున్న ప్రయోగం ఏంటి అంటే మరోసారి డ్యుయల్ రోల్ లో కనిపించడానికి రెడీ అయ్యాడట. రీసెంట్ గా నేను లోకల్ తో సూపర్ హిట్ అందుకున్న నాని త్వరలో నిన్ను కోరితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ప్రస్తుతం వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎం.సి.ఏ సినిమా చేస్తున్న నాని ఆ తర్వాత ఎక్స్ ప్రెస్ డైరక్టర్ మేర్లపాక గాంధికి ఓకే చెప్పాడు.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో సూపర్ హిట్ ఎక్స్ ప్రెస్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న గాంధి ఈసారి నానితో ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాతో వచ్చేందుకు ఫిక్స్ అయ్యాడు. ఇక ఇందులో నాని మరోసారి ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే జెండాపై కపిరాజు, జెంటిల్మన్ సినిమాల్లో డ్యుయల్ రోల్ చేసిన నాని మళ్లీ అదే తరహాలో సరికొత్తగా డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడట. త్వరలో ప్రారంభవనున్న ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరో చిత్రయూనిట్ వెళ్లడించాల్సి ఉంది.