బిగ్ బాస్ పై పెరుగుతున్న డౌట్లు..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బుల్లితెర మీద బిగ్ బాస్ గా వస్తున్న సంగతి తెలిసిందే. హిందిలో సూపర్ హిట్ అయిన ఈ రియాలిటీ షోని అన్ని లోకల్ లాంగ్వెజెస్ కు విస్తరించాలనే స్టార్ మా ప్రయత్నం ఫలించింది. అయితే ప్రోగ్రాం సక్సెస్ అవడంలో మాత్రం వెనుకపడింది. తెలుగులో ఎన్.టి.ఆర్ లానే తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో మొదటి ఎపిసోడ్ ఈమధ్యనే టెలికాస్ట్ అయ్యింది. రియాలిటీ షోస్ లో ప్రత్యేకమైన బిగ్ బాస్ కు కేవలం కోలీవుడ్ లో నామమాత్రపు టి.ఆర్.పి రేటింగ్ రావడం ఆశ్చర్యకరం.

ఇక అక్కడని నుండే డౌట్లు మొదలయ్యాయి. కమల్ చేసిన బిగ్ బాస్ అలా ఉంటే తారక్ చేయబోయే బిగ్ బాస్ షో ఇంకెలా ఉండబోతుందో అని చూస్తున్నారు. పేరున్న నటులెవరూ ఈ షో పేరు చెప్పగానే తప్పించుకుంటున్నారని తెలుస్తుంది. అందులో యాంకర్ అనసూయని అడిగితే బిగ్ బాస్ తాను చేయనని ఖరాకండిగా చెప్పేసిందట. చూస్తుంటే తెలుగు బిగ్ బాస్ కూడా ప్రశ్నార్ధకంగా మారుతుందని అనిపిస్తుంది. ఇప్పటికైతే పోసాని కృష్ణమురళి బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేస్తున్నాడని తెలిసింది. ఇందుకు పోసాని కూడా భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్.