
కింగ్ నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న సినిమా రాజు గారి గది-2. ఓంకార్ డైరక్షన్ లో రాజు గారి గది సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా తుదిమెరుగులు దిద్దుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది. అసలైతే ఎప్పుడో రెండు నెలల క్రితమే సినిమా షూటింగ్ కంప్లీట్ పూర్తి కాగా కొన్ని సీన్స్ మళ్లీ రీషూట్ చేయడం వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చింది. రాజు గారి గదితో సంచలనం సృష్టించిన ఓంకార్ అది కంటిన్యూ అయ్యేలా ఈ సినిమాను కూడా ఫుల్ కామెడీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో నింపేశాడట.
నాగార్జున కెరియర్ లో ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్ పాత్ర చేస్తున్నారట. సమంత కూడా ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నారని తెలిసిందే. సో ఇన్ని హంగులతో ఈ సినిమా ఆగష్టు చివరి వారంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 25న రాజు గారి గది-2 రిలీజ్ అవనుందట. ఆగష్టు 11న నితిన్ లై, బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకి నాయకా సినిమాలు రిలీజ్ ఉండటంతో ఆ సినిమాలకు రెండు వారాలు గ్యాప్ ఇచ్చి తమ సినిమా రిలీజ్ చేస్తున్నాడు నాగ్.