భరత్ అను నేను మహేష్ లుక్ లీక్..!

స్పైడర్ రిలీజ్ కాకుండా సూపర్ స్టార్ మహేష్ తన తర్వాత సినిమా స్టార్ట్ చేశాడు. శ్రీమంతుడు కాంబినేషన్ లో కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న భరత్ అను నేను షూటింగ్ లో పాల్గొన్నారు మహేష్. సినిమా షూటింగ్ టైంలో తీసిన ఓ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. టీ షర్ట్ లో మహేష్ లుక్ అదుర్స్ అనేలా ఉన్నా సినిమాలో మహేష్ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నాడు అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.


భరత్ అను నేను సినిమాలో మహేష్ సిఎంగా కనిపిస్తాడని తెలిసిందే. అయితే ఆ లుక్ మాత్రం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారట చిత్రయూనిట్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.